GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది…
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.1,910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2,000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పని చేస్తోంది.
పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. ఈ నెలాఖరు వరకు అంటే 31 ఏప్రిల్ 2025 దాకా పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ మున్సిపల్ శాఖ..
GHMC : ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారెంట్లు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. వందమందికి రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. 5 లక్షలకుపైన ఉన్న బకాయిల విలువ 860 కోట్లుగా అధికారులు తేల్చారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్…
పల్లెలో కానీ, పట్టణంలో కానీ ఎక్కడైనా సరే సొంతభూమి కలిగి ఉంటే మాత్రం కచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఒకవేళ సరైన సమయానికి టాక్స్ పే చేయకుండా ఉంటే దానికి అదనంగా వడ్డీ కూడా కలుపుతూ ప్రజల నుంచి ఆస్తి పన్నును ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేస్తారు. అలా ఎవరైనా ప్రాపర్టీ టాక్స్ కట్టుకోకపోతే మొదటగా వారికి నోటీసులు జారీ చేసి ఆపై వాటిని సీజ్ చేస్తారు సంబంధిత ప్రభుత్వ అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలోని…
PCC in Financial Crisis: ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.. అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్రంలోని తొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గానూ రూ. 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లాంచాలని…
Property Tax: ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించేవారికి గుడ్‌న్యూస్ చెప్పారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేష్.. వడ్డీ లేకుండా పన్ను చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించినట్టు తెలిపారు.. కోవిడ్ నేపథ్యంలో అపరాధ రుసుము చెల్లించలేక ఎంతోమంది పన్ను చెల్లింపుదారులు బకాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్నో ఏళ్లుగా బకాయిలు చెల్లించని ఆస్తి…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ఖుషీగా వున్నారు. భాగ్యనగరంలో పేరుకుపోయిన ట్యాక్స్ ల వసూలుకు GHMC ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బంపర్ ఆఫర్ ముగిసింది. దీంతో GHMCకి కాసుల వర్షం కురిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ టాక్స్ ఏప్రిల్ నెలలో కట్టిన వారికి 5 శాతం రిబేట్ సౌకర్యం కల్పించింది బల్దియా. దీంతో ఎగబడి మరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశారు నగరవాసులు. ఈ ఆఫర్ కారణంగా జీహెచ్ఎంసీకి భారీగా…