ఐపీఎల్ 2024 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు పలకగా.. వెంకటేశ్ అయ్యర్ రూ.23.75 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్నాడు. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టుకు వెళ్ళాడు.
తొలి రోజు 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 10 ఫ్రాంఛైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ఏకంగా రూ.467.95 కోట్లు ఖర్చు చేశాయి. 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇందులో సీనియర్ ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు కూడా ఉండడం విశేషం. ఈ ఇద్దరిని కనీస ధరకు కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. దేవదత్ పడిక్కల్, యశ్ ధుల్, కార్తీక్ త్యాగీ, పియూష్ చావ్లా, శ్రేయస్ గోపాల్ లాంటి భారత ప్లేయర్స్ కూడా ఉన్నారు.
Also Read: IPL Auction 2025: మొదటి రోజు అమ్ముడైన ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా:
దేవదత్ పడిక్కల్
డేవిడ్ వార్నర్
జానీ బెయిర్ స్టో
వాకర్ సలామ్‌కేలీ
అన్‌మోల్ ప్రీత్ సింగ్
యశ్ ధుల్
ఉత్కర్ష్ సింగ్
ఉపేంద్ర యాదవ్
లువ్‌నిత్ సిసోడియా
కార్తీక్ త్యాగీ
పియూష్ చావ్లా
శ్రేయస్ గోపాల్