లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను దక్కించుకున్న లక్నో.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తీసుకుంటుందేమోనని…
ఐపీఎల్ 2025కి సంబంధించి వేలం ప్రక్రియ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో 182 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉండగా.. 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మెగా వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి 182 మంది ప్లేయర్స్ కోసం మొత్తంగా రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. ఏ జట్టులో ఏ ప్లేయర్స్…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. హిట్టర్లు లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మలను తీసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌కు తోడుగా టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను కొనుగోలు చేసింది. భారత్ బౌలర్లు కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్‌లను ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్,…
ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరోసారి అనుభవానికే పెద్దపీట వేసింది. ‘డాడీస్ ఆర్మీ’ అనే పేరుకు తగ్గట్టే.. సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. బడా స్టార్ జోలికి పోకుండా, కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా.. మంచి ఆటగాళ్లను తక్కువ ధరకే కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచనలతో సీఎస్‌కే మేనేజ్మెంట్ వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సీఎస్‌కేలో అనుభవ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు…
రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు…
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం తొలి రోజు మొత్తంగా 84 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. అందులో కేవలం 72 మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగతా 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. 10 టీమ్స్ 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏకంగా 467.95 కోట్ల రూపాయలు వెచ్చించాయి.
ఐపీఎల్ 2024 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు పలకగా.. వెంకటేశ్ అయ్యర్ రూ.23.75 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్నాడు. టీమిండియా…
ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రోజులో ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్లేయర్స్ భారీ ధరకు అమ్ముడుపోయారు. ఈసారి పర్స్ వాల్యూను రూ.90 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెంచడంతో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. జెడ్డాలో ఆదివారం జరిగిన వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.…
IPL 2025 Auction: మరో రెండు రోజుల్లో రెండు రోజులపాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం జరగనుంది. ఈ వేలంలో ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు తమ జట్టుకు సరిపోయే ఆల్ రౌండర్లుగా సహకరించగల క్రికెటర్లను జోడించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువ డబ్బుతో స్టార్ ఆల్ రౌండర్లను టీంలోకి తీసుక రావాలి అనుకుంటున్నాయి. దింతో ఇప్పుడు భారత ఆల్ రౌండర్లతో పాటు విదేశీ ఆల్ రౌండర్లకు కూడా మంచి గిరాకీ ఉంది. మరి ఏ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి మొత్తంగా 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురిని జత చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి…