తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో
అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
READ MORE: CM Chandrababu : దళితుల కోసం మంచి స్కీంను తీసుకొస్తాం..
కొద్ది రోజుల క్రితం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లేదని అధికారికంగా చేసిన ప్రకటన వివాదంగా మారింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధికారులు మధ్య క్యాన్సర్ వార్ నడిచింది. హెల్త్ రిపోర్ట్‌లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లేదని అధికారులు చెప్తి ఎమ్మెల్యే మాత్రం తప్పుడు రిపోర్టులు ఇవ్వద్దని మనవి చేశారు. గ్రామంలో క్యాన్సర్ లేదని అధికార ప్రకటన చెయ్యటంతో ఊపీరి పీల్చుకున్న గ్రామస్తుల్లో మరోసారి సర్వేకు సిద్ధం కావడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల నిర్ధారణ లెక్కల విషయంలో తప్పులు ఉన్నాయని.. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన ఆరోపణ. బలభద్రపురం పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి 38 మంది అనుమానితులను గుర్తించి వీరందరినీ రాజమండ్రిలోని జీఎస్ఎల్ క్యాన్సర్ హాస్పటల్‌కు తీసుకుని వెళ్లి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.
READ MORE: CM Chandrababu : దళితుల కోసం మంచి స్కీంను తీసుకొస్తాం..
ఈ వైద్య పరీక్షల్లో ఎవరికీ క్యాన్సర్ నిర్ధారణ కాలేదు. ఈ పరీక్షల్లో 29 మందికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారించగా, 9 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. వీరిలో ఎముకల సమస్యలతో ఇద్దరు, గైనిక్ సమస్యలతో ఇద్దరు, లివర్, కిడ్నీ సమస్యలు, అలాగే తీవ్రమైన రక్తహీనతలతో ఒక్కొక్కరు బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులైన ఏడుగురి నుంచి నమూనాలు సేకరించి, నివేదికల కోసం వేచి ఉన్నారు. బలభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకా రికార్డుల్లో నమోదు చేసిన వీటిని ప్రమాణికంగా తీసుకుని డీఎంహెచ్ఓ నివేదిక ఇచ్చేశారు. బలభద్రపురం గ్రామంలో ఉన్న 10 వేల మంది జనాభాకి వైద్య పరీక్షలు చేయకుండా ఎలా నివేదికలో లెక్కలు తేల్చేస్తారనేది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వారించారు.
అలాగే రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో గ్రామంలో 399 కుటుంబాల్లో 1295 మందికి వైద్య పరీక్షలు చేసి 62 మందికి క్యాన్సర్ నిర్ధారణ చేశారు. ఇంకా గ్రామంలో 8700 మందికి వైద్య పరీక్షలు చేస్తే వారిలో ఎంతమంది ఉంటారో అనే ఆందోళన నెలకొంది. అయితే ఇవి అన్ని పక్కన పెట్టి వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా
బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తేల్చిచెప్పారు. అయితే ఈ కేసులు కేరళతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయని, క్యాన్సర్ కేసుల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను పరిగణలోకి తీసుకుని లెక్కపెట్టిన జాతీయ యావరేజ్ కేసులు కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వాదన. రాష్ట్రాలు వారిగా కాకుండా జాతీయ స్థాయిలో లెక్క కడితే ఏలా అంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ప్రకటనకు ఎమ్మెల్యే ప్రకటనకు అసలు పొంతన లేదు. ఈ ప్రకటనలతో బలభద్రపురంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ప్రకటనతో ఏకీభవించాలో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.