వోక్స్‌వాగన్ ఇండియా తన లగ్జరీ SUV అయిన టిగ్వాన్ ఆర్-లైన్ను ఏప్రిల్ 14, 2025న భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ స్పోర్టీ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌తో లగ్జరీ SUV సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ SUV లో 2-లీటర్ TSI Evo పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 204 PS శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ అందించారు. దీనితో పాటు, దీనికి 4మోషన్ ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యం అందించారు. దీని కారణంగా దీనిని ఏ రకమైన రోడ్డుపైనైనా నడపవచ్చు.
Also Read:Rahul Gandhi: రాజస్థాన్ పర్యటనలో రాహుల్‌గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!
ఫీచర్లు
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ క్రేజీ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 15-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, IDA వాయిస్ అసిస్టెంట్, రోటరీ కంట్రోలర్‌తో కూడిన స్క్రీన్, ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్‌లు, యాంబియంట్ లైట్, పనోరమిక్ సన్‌రూఫ్, మ్యాట్రిక్స్ హెడ్‌లైట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్, LED DRL, రూఫ్ రైల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read:Delhi: రేపటి నుంచి ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 మూసివేత.. ప్రయాణికులకు అలర్ట్
SUV లో భద్రత కోసం తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, 21 ఫీచర్లతో లెవల్ 2 ADAS వంటి భద్రతా లక్షణాలు అందించబడ్డాయి. ఈ SUVని వోక్స్‌వ్యాగన్ రూ. 48.99 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేసింది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీ పూర్తి సైజు ఎస్‌యూవీ విభాగంలో విడుదలైంది. ఈ విభాగంలో, ఇది టయోటా ఫార్చ్యూనర్, లెజెండర్, JSW MG గ్లోస్టర్ లతో నేరుగా పోటీపడుతుంది.