Kadapa: కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట తన ఇద్దరు పిల్లలకు వ్యవసాయ పొలానికి చెందిన గేటుకు ఉరివేసి చంపి ఆపై భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలోని మోరెనా హైవేపై తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. కుటుంబ సమేతంగా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు…
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు ఇళ్లు దగ్ధం కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు.
కొంత మంది వింత చేష్టలతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మందు తాగి నానా హంగామా చేస్తుంటున్నారు. నడి రోడ్డుపైనే నిలబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు నార్కోటెట్ సిబ్బంది కలిసి సుమారు వంద కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.