ఆలుమగలు అన్నాక చిన్న.. చిన్న గొడవలు.. అలకలు సహజమే. అలా పోట్లాడుకుంటారు.. అంతలోనే కలిసిపోతుంటారు. ఇదంతా సంసార జీవితంలో కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. యూపీలో ఒక మహిళ మాత్రం బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా చోలాస్ గ్రామంలో ఇంటి పైకప్పు కూలింది. దీంతో.. శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. భారీ వర్షం కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
వందే భారత్ రైలుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్ పైకప్పు నుంచి వర్షపునీరు ధారలా కారిపోతుంది. దీంతో ప్రయాణికులు సీట్లో కూర్చోలేని దుస్థితి ఏర్పడింది. భారీగా నగదు చెల్లించి టికెట్ తీసుకుని.. సీట్లో కూర్చునే అవకాశం లేకుండా పోయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ సర్కార్ అయోధ్యలో నిర్మించిన రామమందిరం ఒక్క వర్షానికే ప్రభావం చూపించింది. సోమవారం కురిసిన వర్షానికి నీరు లీకేజ్ అయింది. బీజేపీ ప్రభుత్వం 2024 జనవరి 22న ఎంతో అట్టహాసంగా ఆలయాన్ని ప్రారంభించారు.
తమిళనాడులోని చెన్నైలోని సైదాపేట ప్రాంతంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఓ పెట్రోల్ పంపు పై కప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా.. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆ అగ్నికీలల్లో మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మూడేళ్ల బాలిక తన ఇంటి పైకప్పుకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైందని పోలీసులు ఆదివారం తెలిపారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయం లో ఘోర ప్రమాదం తప్పి పోయింది. ఆ జిల్లా కలెక్టర్ బంగ్లాలోని ఓ గది పై కప్పు కుప్ప.. ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అనంతపురం కలెక్టర్ కార్యాలయం లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి భవనం కావడంతో.. ఈ మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యం లో కలెక్టర్ కార్యాలయం లోని ఓ గది కి చెందిన…