ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది.
నేపాల్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 6 మంది చనిపోయారు. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
భారీ వర్షాలు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పొట్టన బెట్టుకుంది.. కర్ణాటక రాష్ట్రం బెల్గాం తాలూకాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బదల అంకాలగిలో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూప్పకూలింది.. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు కన్నుమూశారు.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న…