ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సనత్నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో చోటు చేసుకుంది. 204 ఫ్లాట్లో విద్యుదాఘాతంతో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను సాయంత్రం కాలనీవాసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్లో…