మంత్రి కొండా సురేఖపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ సెంట్రల్ జైలును ఎందుకు కూల్చారని అన్నారు.. జైలు శిథిలావస్థలో ఉన్నా తీరును గుర్తించి, దాన్ని కూల్చడం జరిగిందని వినయ్ భాస్కర్ తెలిపారు. ప్రాథమిక హక్కులైనటువంటి విద్య వైద్యాన్ని మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం పాఠశాలను, వైద్యశాలలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుందని వినయ్ భాస్కర్ తెలిపారు. అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని సంకల్పంతో 1100 కోట్లతో 24 అంతస్తులలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ కు పోకుండా అన్ని వైద్య సేవలు అందించేందుకు నిర్మాణం చేస్తుంటే దాన్ని హేళన చేస్తున్నారని తెలిపారు. నేరస్తులు ఊరు బయట అయిన ఉండచ్చు.. రోగులకు అందుబాటులో ఉండేలా ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం అది కూడా తెలవకుండా కొండా సురేఖ.. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Corona: మళ్లీ కరోనా కోరలు.. తెలంగాణలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎంజీఎం పరిస్థితి ఏంటి..? గత తొమ్మిదేళ్లలో ఎంజీఎం పరిస్థితి ఏంటి..? అని అన్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను, కొత్తగా నిర్మించినటువంటి సెక్రటేరియట్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వినయ్ భాస్కర్ తెలిపారు. సెక్రటేరియట్ ను బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో పాలకులు మరియు పరిపాలన యంత్రాంగం ఉండాలనే దృష్టితో కట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలను చూద్దాం ఇప్పుడున్నటువంటి పాఠశాలను చూడండి అని అన్నారు. ఈరోజు వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే దూర ద్రుష్టితో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఎంతో మెరుగుపరచాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పాఠశాలను పట్టించుకునేటువంటి పాపాన పోలేదని విమర్శించారు.
Read Also: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటే వాళ్ళే కారణం.. సీపీఐ నారాయణ సంచలన వీడియో విడుదల
బీఆర్ఎస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు మానుకోవాలని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పి, అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టారు. మా శాసనసభ్యుడు హరీష్ రావు అడిగిన ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అన్నారు.