ఇంటిపేరు లేకపోవడంతో ఓ వ్యక్తిని ఏకంగా ప్లైట్ ఎక్కకుండా చేశారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. అతని పాస్‌పోర్ట్‌లో ఒకే పేరు ఉన్నందున మాస్కో విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ విమానం ఎక్కకుండా ఆపేశారు. Read Also: Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాస్‌పోర్ట్‌లో ఇంటిపేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన వ్యక్తిని విమానం ఎక్కనివ్వలేదు విమానయాన సిబ్బంది. ఆ వ్యక్తి తన గురించి చెప్పుకుని తాను ఇప్పటికీ…
Kethireddy Pedda Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు నగరానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మునిపల్ అధికారులు చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లబు ఆయన అధికారులకు అందచేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని ఆయన అధికారులకు తెలిపారు. నా ఇంటికి ప్లానింగ్ ఉందో లేదో అధికారులే తెలియజేయాలని ఆయన అన్నారు. సర్వేలో 1వ ఫ్లాట్ నుంచి 16 ఫ్లాట్ వరకు సర్వే చేయాలని..…
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ను జైలుకు పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు…
Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్‌సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Murder : హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన…
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పదిన్నర సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు కోర్టు తెలిపింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్…
ఒక హోటల్ నుంచి మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం అయిన ఉదంతం కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఇటీవల దీక్షాధీవస్ సభ జనసమీకరణ కోసం భారీగా డబ్బుల ఖర్చు చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జిలకు పదిలక్షల రూపాయల చొప్పున సర్ధుబాటు చేసినట్లు సమాచారం. పదిలక్షలలో కేవలం ఐదులక్షలే ఖర్చు చేశారని.. కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా.. కార్యక్రమం ముగిసిన తరువాత వి పార్క్ హోటల్ లోని రూం నంబర్ 209 లో కార్యకర్తలతో కలిసి విందు ఏర్పాటు చేశారు. ఉదయం…
పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచగా... కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.