ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కాంగ్రెస్ లోకి రావాలని నన్ను ఒప్పించి పార్టీలోకి ఆహ్వానించారు అని ఆయన తెలిపారు. చిన్న తనంలోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా నా స్వార్ధం కోసం చేయను.. మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read Also: Kishan Reddy: కేంద్ర మంత్రికి ఢిల్లీ నుండి ఫోన్.. అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..!
ఇక, పదవులు ఎవరికి శాశ్వతం కాదు.. ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో నీ జన్మ ముగుస్తుంది అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.. పేద ప్రజలకు కావాల్సిన ఆరు గ్యారెంటీ లు సోనియా గాంధీ ప్రకటించారు అని ఆయన పేర్కొన్నారు. వాళ్ళ జాగీర అనుకునే పరిపాలన వద్దు.. ప్రజాస్వామ్య హితంగా పాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. గోదావరి జలాలతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు తీసుకొచ్చి పాలేరులో నింపుతానంటూ తుమ్మల చెప్పారు.
Read Also: Asian Games 2023: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ కల సాధ్యమయ్యేనా?
మీ ఆశలకు తగ్గట్టుగా సర్వస్వం పార్టీ అభివృద్ధికి అనుగుణంగా పని చేస్తాను అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల ఆనందంగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని ఆయన వెల్లడించారు. నా శక్తి మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిలించడానికి కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.