Vizag: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన ముందు విశాఖలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ జనజాగరణ సమితి పేరుతో సిటీలో బ్యానర్లే ఏర్పాటు చేశారు.. మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో, భీమిలి వెళ్లే దారిలో ఈ బ్యానర్లు ప్రత్యక్షం అయ్యాయి. కాగా, భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం రేపు విశాఖ రానున్నారు సీఎం వైఎస్ జగన్.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ రెండు కీలకమైన మైలురాళ్లుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, సీఎం వైఎస్ జగన్ టూర్ కోసం సన్నాహాలు, ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు సీఎం జగన్ టార్గెట్‌గా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.
Read Also: Vijayawada Crime: బెజవాడలో దారుణం.. రూ.100 ఇవ్వలేదని కత్తితో దాడి
కాగా, గతంలోనూ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందు హడావిడి చేసింది జనజాగరణ సమితి.. విశాఖలో సీఎం జగన్ వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపాయి. ‘గో బ్యాక్ సీఎం సర్’.. ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు గతంలో హల్ చల్ చేశాయి.. ఆంధ్రా యూనివర్సిటీ ప్రవేశద్వారం వద్ద, పలు కూడళ్లలో ‘జన జాగరణ సమితి’ పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. జగదాంబ, మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్ మెట్ట తదితర కూడళ్లలో పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని గమనించిన వైసీపీ నేతు.. వెంటనే వాటిని తొలగించేశారు. అంతేకాకుండా గతంలో జనజాగరణ సమితి నిర్వహకుడు వాసుపై పోలీసులు కేసులు పెట్టిన విషయం విదితమే.