Vijayawada Crime: బెజవాడలో దారుణం.. రూ.100 ఇవ్వలేదని కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: విజయవాడలో దారుణం వెలుగు చూసింది.. వంద రూపాయలు ఇవ్వలేదని యువకుడుపై కత్తితో దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఈ ఘటన జరిగింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాచవరంలోని ఓ సెలూన్ లో పనిచేస్తున్న భోగిల హరిప్రసాద్.. నిన్న రాత్రి 11 గంటలకు నడిచి వెళ్తుండగా మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు అతడిని అడ్డుకున్నారు.. 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అయితే, వంద రూపాయాలు ఇచ్చేందుకు నిరాకరించాడు హరిప్రసాద్.. దీంతో.. ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డారు.. గాయాలపాలైన హరిప్రసాద్‌ను జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. నిజంగా వంద రూపాయల కోసమే కత్తితో దాడి చేశారు.. ఈ దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, గతంలోనూ రూ.5, రూ.10కి కూడా దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి.. ఏదైమానై.. వంద రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడిపై దాడి ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది.
Read Also: Gangster Murdered in Tihar Jail: తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. గ్యాంగ్‌స్టర్ మృతి
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!