బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫెక్లీలను తొలగించారు.
Vizag: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన ముందు విశాఖలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ జనజాగరణ సమితి పేరుతో సిటీలో బ్యానర్లే ఏర్పాటు చేశారు.. మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో, భీమిలి వెళ్లే దారిలో ఈ బ్యానర్లు ప్రత్యక్షం అయ్యాయి. కాగా, భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం రేపు విశాఖ రానున్నారు సీఎం వైఎస్ జగన్.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ రెండు…