హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ (మంగళవారం) ఎల్బీనగర్ లోని ఓ టింబర్ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్లు, పాత కార్లు షోరూమ్ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ లో దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అందుబాటులోకి రాలేదని స్థానికులు వెల్లడించారు.
Also Read : Bihar: బీహార్లో దారుణం.. పోలీస్ ఇంట్లోనే వ్యభిచారం
అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు చుట్టు ప్రక్కల ప్రజలను ఇళ్లలో నుంచి ఖాళీ చేయిస్తున్నారు. దీంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పక్కనే ఉన్న మల్టీప్లెక్, అపార్ట్మెంట్లకు మంటలు అంటుకుంటే పరిస్థితి ఏంటి అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read : Ms Dhoni : ధోని పై అభిమానాన్ని చాటుకున్న తెలుగోడు.. వరల్డ్ బిగ్గెస్ట్ గిఫ్ట్..
టింబర్ డిపో పక్కనే ఉన్న పాతకార్ల షోరూమ్‌కూ వ్యాపించిన మంటలు.. మంటలకు దగ్ధమైన 50కిపైగా కార్లు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.