ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఈడీని మాజీ మంత్రి కేటీఆర్ సమయం కోరారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు టైం ఇవ్వాలని ఆయన కోరారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీలో 14 రంగాలు పెట్టుబడి తీసుకొచ్చేవిగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ వాళ్లకు రేస్ కోసం అడిగాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చాలనుకున్నామని తెలిపారు. వాళ్లు రాలేమని అన్నారు, ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ శ్వేత పత్రానికి కౌంటర్‌గా మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీల శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనికి కౌంటర్‌గా తాజాగా కేటీఆర్ స్వేద…