ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు పిల్లలంటే చాలా ఇష్టం అనే సంగతి అనేక సందర్భా్ల్లో బయటపడుతూ ఉంటుంది. తన పిల్లలతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఆయన. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కూడా. తాజాగా పిల్లల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల ప్రాధాన్యత గురించి ప్రపంచానికి గుర్తు చేశారు. పిల్లల్ని కలిగి ఉండటం అంటే ప్రపంచాన్న కాపాడినట్లే అంటూ ట్వీ్ట్ చేశారు.
Also Read: UP Police: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిపై పోలీసు అత్యాచారం!
పడిపోతున్న జనాభా సంక్షోభం గురించి గతవారం బుడాపెస్ట్ లో ద్వైవార్షిక జనాభా సదస్సు జరిగింది. దీనికి మస్క్ కొన్ని కారణాలతో హాజరు కాలేకపోయారు. ఇక మంగళవారం టెక్సాస్ లోని టెస్లా గిగా ఫ్యాక్టరీకి వచ్చారు హంగేరీ అధ్యక్షురాలు కటాలిన్. తన ఫ్యాక్టరీకి వచ్చిన అధ్యక్షురాలికి స్వాగతం పలికిన మస్క్ ఆమెతో కలిసి ఫ్యాక్టరీ అంతా పర్యటించారు. ఆ సమయంలో మస్క్ వెంట ఆయన కుమారుడు ఎక్స్ యాష్ ఏ 12(X Æ A XII) కూడా ఉన్నాడు. తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకొని మస్క్ ఫ్యాక్టరీ అంతా తిరిగారు.
కటాలిన్ నోవక్ తో మస్క్ జనాభా సంక్షోభంపై చర్చలు నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ‘‘పిల్లల్ని కలిగి ఉండడం అంటే ప్రపంచాన్ని కాపాడినట్టే’’అంటూ ట్వీట్ చేశారు మస్క్. దీనిపై హంగేరి అధ్యక్షురాలు కటాలిన్ నోవక్ ఫేస్ బుక్ లో స్పందించారు. పిల్లల్ని కలిగి ఉండాలి అనే భావన యువతలో కలిగించే విషయంపై తాను, ఎలాన్ మస్క్ చర్చలు జరిపినట్లు ఆమె తెలిపారు. నేటి తరంలో చాలా మంది సంతానం వద్దనుకుంటున్నారని ఇది చాలా ఆందోళన కలిగిస్తుందని ఆమె అన్నారు. మొత్తానికి ప్రపంచం పిల్లల్ని రక్షిస్తే పిల్లలు ఈ ప్రపంచాన్ని రక్షిస్తారు అని అర్థం వచ్చేలా మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.