Twitter Ella Irwin : సోషల్ మీడియాను ఉపయోగించని వారు లేరంటే ఆశ్చర్యం లేదు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా్గ్రామ్, యూట్యూబ్ ఇలా ఎన్ని సోషల్ మీడియా మాధ్యమాలు ఉంటే అన్నింటిలోనూ కొందరు యాక్టివ్‌గా ఉంటారు. కొందరు వారికి నచ్చిన సోషల్ మీడియాల్లో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. ఇలా చూసుకుంటే ఎక్కువగా ఉపయోగించే వాటిలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ముందుంటే ఆ తరువాత యూట్యూబ్, ట్విట్టర్ ఉంటున్నాయి. అటువంటి సోషల్ మీడియా రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది ట్విట్టర్. అటువంటి ట్విట్టర్ సంస్థ నుంచి ప్రధాన స్థానాల్లో ఉంటున్న కొందరు ఉద్యోగులు సంస్థను వీడి బయటికి వెళుతున్నారు.
Also Read : Bandi sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికి ఉచిత విద్య అందిస్తాం
తన సోషల్ మీడియా కంపెనీకి రాజీనామా చేసినట్లు ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ గురువారం రాయిటర్స్‌తో చెప్పారు. ఎల్లా ఇర్విన్ జూన్ 2022లో ట్విట్టర్‌లో చేరారు. అప్పటి వరకు ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్‌గా పనిచేస్తున్న యోయెల్ రోత్ రాజీనామా చేయడంతో ఇర్విన్ నవంబర్‌లో ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె కంటెంట్ నియంత్రణను పర్యవేక్షించేవారు. ఇర్విన్ రాజీనామా పరిణామంపై ఎలన్ మస్క్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Also Read : Daggubati Family: అన్న ‘పరేషాన్’, తమ్ముడు ‘అహింస’… ఏంటో పరిస్థితి?
అక్టోబరులో బిలియనీర్ ఎలోన్ మస్క్‌ని ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. విద్వేష పూరిత కంటెంట్, హానికరమైన కంటెంట్ ప్రసారం మూలంగా ట్విట్టర్ సంస్థ విమర్శలను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితులను చూసిన ప్రకటన దారులు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. ఇలా ఇతరుల తప్పుకుంటున్న తరుణంఓనే సంస్థ ట్రస్‌్ట అండ్ సేఫ్టీ టీమ్ అధిపతిగా బాధ్యతల నుంచి తప్పుకుంటూ.. రాజీనామా చేస్తున్నట్టు ఎల్లా ఇర్విన్ ప్రకటించారు.
Also Read : Boyapati Rapo: ఇది క్లైమాక్స్ కాదు… అంతకు మించి
ట్విట్టర్ యొక్క కొత్త CEO కావడానికి మాజీ ఎన్‌బీసీ యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్ లిండా యాకారినోను నియమించుకున్నట్లు మస్క్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుండి.. ట్విట్టర్‌లో ఖర్చులను క్రమంగా తగ్గించింది. హానికరమైన మరియు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను నిరోధించడానికి, ఎన్నికల సమగ్రతను మరియు సైట్‌లోని ఖచ్చితమైన సమాచారాన్ని రక్షించడానికి కృషి చేసిన అనేక మంది ఉద్యోగులతో సహా వేలాది మంది ఉద్యోగులను ట్విట్టర్ తొలగించిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.