Bandi sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అందరికి ఉచిత విద్య అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ శుభకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటున్నామన్నారు. పార్లమెంట్ లో సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం మాట్లాడారని గుర్తు చేశారు. బలిదానాలు వద్దు అని చెప్తు యువతకు ధైర్యాన్ని ఇచ్చింది సుష్మాస్వరాజ్ అని గుర్తు చేశారు. ఆశయాలకు భిన్నంగా తెలంగాణలో పాలనా సాగుతుందని మండిపడ్డారు. నలుగురి వల్ల దేశంలో రాష్ట్రం నవ్వులపాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, యువత, రైతులు ఎవరిని కలిసిన ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం.. ఏం జరుగుతుంది అని అడుగుతున్నారని బండి తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్ళామన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అందరికి ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇప్పుడు కనీసం చాక్ పీస్ కూడా లేని పరిస్థితి లేదని గుర్తు చేశారు. సంవత్సరం ముందే ఫీజ్ రీయంబర్మెంట్స్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. 25వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చేసిన యాత్రలు చేసారని గుర్తు చేశారు. బీజేపీ కృషి ఫలితంతోనే రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. 1400 కోట్ల అమరుల బలిదానాలతో ఈ తెలంగాణ ఏర్పడిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. అన్ని అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రం నడుస్తుంది.. ప్రజలు బతుకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు లక్షల కోట్ల రూపాయల నిధులను తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ మారిందన్నారు.
GVL Narasimha Rao: పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన