Washing Fruits: పండ్లపై ఉండే రసాయణాలు తొలగాలంటే ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సహజంగా పండించే పండ్లు, కూరగాయలు చాలా తక్కువ. అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని పండించే క్రమంలో వాటిపై పురుగు మందులు కొడుతుంటారు. వాటిని శుభ్రంగా కడిగి తినకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రిమిసంహారక మందులు తొలగేలా వాటిని ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.. పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. సమతుల్య ఆహారం కోసం వీటిని కూడా తింటూ ఉండాలి. అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, మామిడిపండ్లు, జామకాయలు.. ఇలా అన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అయితే వీటన్నింటిని క్రిమిసంహారక మందుల ద్వారా పండించడం అధికమైంది కాబట్టి రసాయనాలు నిండిన పండ్లను అలాగే తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
READ MORE: SRH Kavya Maran: ఉత్కంఠ మ్యాచ్ విజయంతో ఎగిరిగంతులేసిన కావ్య పాప.. వీడియో వైరల్..
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
పండ్లు కొన్నాక వాటిని నేరుగా తినకూడదు. ఇంటికి తెచ్చాక కొంత సేపు వాటిని నీటిలో నాన బెట్టాలి. పండ్లు మునిగే వరకు నీటిలో వేసి నానబెట్టాలి. అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత వాటిని చేతితో రుద్దుతూ… శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే వాటిపైనున్న పెస్టిసైడ్స్ పోయే అవకాశం ఉంది. రెండో పద్ధతి ఏమిటంటే.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత ఆ పండ్లను చేతితోనే శుభ్రంగా రుద్ది మరొకసారి కొళాయి కింద పెట్టి నీటిలో కడగండి. అలా కాకుండా స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు వేసి మరిగించండి. కాస్త గోరువెచ్చగా అయినప్పుడు పండ్లను ఆ నీటిలో ఒక నిమిషం పాటు నానబెట్టండి. ఆ తర్వాత వెంటనే తీసి చల్లని నీటిలో వేయండి. వెనిగర్ పండ్లపై ఉన్న రసాయణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి ఒక నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత వాటిని తీసి కొళాయి కింద పెట్టి చేత్తో రుద్ది కడగండి. ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది. పండ్లను కడిగేందుకు అది కూడా బాగా పనిచేస్తుంది. నీటిలో ఈ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి పండ్లను వేసి నానబెట్టాలి. ఆ తర్వాత ఆ పండ్లను తీసి కుళాయి కింద ఉన్న నీటిలో రుద్ది కడగాలి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే పండ్లను తప్పకుండా కడిగే తినాలి. లేదంటే రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!