ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పున:ప్రతిష్ట మహోత్సవం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ. 4 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయలను కేటాయించారు. పున:ప్రతిష్ట కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆరాధ్యదైవంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతా అని, స్వామి వారి ఆశీస్సులతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని చెప్పారు.
‘దశాబ్దాలుగా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఆరాధ్యదైవంగా ఉంది. ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెడతా. రూ. 4 కోట్ల 74 లక్షల రూపాయలు దేవాలయ అభివృద్ధి కి కేటాయించాము. మీరందరూ గెలిపిస్తేనే నేను ఉప ముఖ్యమంత్రిని అయ్యాను. రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని ప్రజా ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ పోతుంది. రాష్ట్రంలో ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణం కింద 20 వేల కోట్ల రూపాయలు ఇస్తుంది. 22 వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేశాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వారికి రూ.12 వేలు ఇస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
Also Read: Tummidihetti Barrage: నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఎమ్మెల్యే హరీష్ బాబును అడ్డుకున్న పోలీసులు!
‘ప్రతి ఎన్నికల కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలు పెట్టా. శ్రీయోగనంద లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నేను ఈస్థాలో ఉన్నా. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఉండాలి. ప్రజా సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది. పేద ప్రజలకు గ్యాస్, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ లాంటి పథకాలు ఈ ప్రభుత్వం అందజేస్తుంది. రైతు భరోసా, రుణమాఫీ, ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం అందజేస్తుంది. పేద ప్రజలకు ఇందిరా గిరి ఆవాస్ యోజన పథకం కూడా ఉంది’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.