Delhi Car Blast Case: ఎర్రకోట బయట నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఎన్ఐఏ ఈ కేసులో మరో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. దీంతో కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈ నలుగురిని పట్టుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పటియాలా హౌస్ కోర్టు జిల్లా సెషన్స్ జడ్జి జారీ చేసిన ప్రొడక్షన్ వారెంట్ల ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయని వెల్లడించింది.
READ ALSO: Keerthy Suresh: ఏఐ మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన..
అరెస్టయిన నిందితులు..
డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై – పుల్వామా (జె&కె)
డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ – ఆనంత్‌నాగ్ (జె&కె)
డాక్టర్ షాహీన్ సయీద్ – లక్నో (ఉత్తర ప్రదేశ్)
మౌలానా ఇర్ఫాన్ అహ్మద్ వగే – షోపియన్ (జె&కె)
ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర ఉగ్రదాడిలో ఈ నలుగురూ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ బ్లాస్ట్‌లో పలువురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ మరో ఇద్దరిని అదుపులోకి చేసింది. బ్లాస్ట్‌కు ఉపయోగించిన కారు అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తిపై రిజిస్టర్ అయి ఉన్న విషయం తెలిసిందే. అలీని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే జసీర్ బిలాల్ వాణి @ దానిష్ ఈ ఉగ్రదాడి నిర్వహించిన టెరరిస్ట్‌కు టెక్నికల్ సహాయం అందించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయనను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి విచారణ కొనసాగుతున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. కేసు నంబర్ RC-21/2025/NIA/DLI కింద మొత్తం కుట్ర వలయాన్ని ఛేదించేందుకు ఎన్ఐఏ ముమ్మర కసరత్తు కొనసాగిస్తోంది.
READ ALSO: US Court Iran Fine: ఇరాన్ తప్పుకు అమెరికా పరిహారం .. ఎందుకో తెలుసా!