US Court Iran Fine: ఇరాన్ తప్పుకు అమెరికా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ చర్యలకు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై అమెరికా ప్రత్యేక కోర్టు 6 బిలియన్ రూపాయల జరిమానా విధించింది. వాస్తవానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికాకు బద్ధ శత్రువుగా పరిగణిస్తుంది. ఇదే సమయంలో ఖమేనీ కూడా అమెరికాను చంపాలని పదే పదే పిలుపునిచ్చాడు. ఇటీవల అమెరికా మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై B-2 బాంబులతో దాడి చేసిన విషయం తెలిసిందే. పలు నివేదికల కథనం ప్రకారం.. అలీ ఖమేనీ తరఫున అమెరికా ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి జరిమానా చెల్లించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇంతకీ ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: kissing History: ముద్దు ముచ్చట.. ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలో ఫస్ట్ కిస్ స్టోరీ!
అసలు ఏం జరిగిందంటే..
అమెరికాలో రాజకీయ ఖైదీగా ఉన్న అక్బర్ లకిస్తానీ యూఎస్ కోర్టులో ఒక దావా వేశారు. తనను ఇరాన్‌లో హింసించారని, బలవంతంగా బందీగా ఉంచి ఇరాన్‌లో జైలులో పెట్టారని, ప్రభుత్వ ఆదేశం మేరకు తనను హింసించారని లకిస్తానీ ఆరోపించారు. ఈ కేసులో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని ప్రధాన నిందితుడిగా లకిస్తానీ పేర్కొన్నారు. కోర్టు ఇరాన్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసినప్పుడు, ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఆధారాల ఆధారంగా సుదీర్ఘ కోర్టు విచారణ జరిగింది. అనంతరం వాస్తవాల ఆధారంగా కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో కోర్టు ఖమేనీని దోషిగా నిర్ధారించి 12 బిలియన్ రూపాయల జరిమానా విధించింది. అయితే ఇరాన్ నుంచి ఈ డబ్బును పొందడం అంత సులభం కాదని చెప్పినప్పుడు, కోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం ఆ మొత్తంలో సగం చెల్లిస్తుందని, అలాగే మిగిలిన మొత్తాన్ని అందించేందుకు కూడా ప్రయత్నిస్తుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంతకీ అక్బర్ లకేస్తానీ ఎవరు..
ఇరాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి అక్బర్ లకేస్తానీ. లకేస్తానీ ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో, ఇరాక్‌తో కూడా పోరాడాడు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిన అనంతరం ఆయన అజర్‌బైజాన్‌కు వెళ్లి అక్కడ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆయన వీసాపై అమెరికాకు ప్రయాణించాడు. అనంతరం ఆయన అమెరికాలో కూడా పౌరసత్వం పొందాడు. అనంతర కాలంలో ఆయన అమెరికన్ పౌరసత్వంతో తిరిగి ఇరాన్‌కు వచ్చినప్పుడు, ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై ఆయనను ఇరాన్ అతన్ని అరెస్టు చేసింది. ఈ సమయంలో తనను ఇరాన్ ప్రభుత్వం హింసించిందని ఆయన యూఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన న్యాయ విచారణలో కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది.
READ ALSO: YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిమాణం.. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్ బృందం..