దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ పోస్ట్‌లో పని చేస్తున్న ఐఎఎస్ దంపతుల 27 ఏళ్ల కుమార్తె బహుళ అంతస్తుల భవనంలోని 10వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ బైక్‌పై ఆమె మృతదేహాన్ని చూసిన గార్డు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న యువతిని లిపి రస్తోగి(27)గా గుర్తించారు. ఆమె మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్, రాధిక రస్తోగిల కుమార్తె. తెల్లవారుజామున 4 గంటలకు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో లిపి తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె 10 అంతస్తులోని తన ఇంటి కిటికీలోంచి దూకారు. ఆత్మహత్యకు ముందు ఆమె సూసైడ్ నోట్ కూడా రాశారు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లిపి రస్తోగి తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయలేదు. ఆమె హర్యానాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. ఆమె పరీక్ష మరికొద్ది రోజుల్లో జరగబోతోంది. పరీక్షలకు సరిగ్గా సిద్ధం కాలేదని నోట్ లో పేర్కొన్నారు. ముంబైలోని కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో బీఏ చదివిన లిపి రస్తోగి మార్కెటింగ్ రంగంలోనూ పనిచేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్, మార్కెటింగ్‌లో పనిచేశారు. బ్యూటీ కంపెనీ Nykaa లో కన్సల్టెంట్‌గా పనిచేశారు. అయితే 2020 సంవత్సరం తర్వాత ఈ రంగానికి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లా చదవడం మొదలుపెట్టారు.
READ MORE: BSF Recruitment 2024: అలర్ట్.. భారత సైన్యంలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులే..
లిపి రస్తోగి తండ్రి వికాస్ రస్తోగి మహారాష్ట్రలోని హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి రాధికా రస్తోగి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. న్యాయవాది సారా కపాడియా యొక్క న్యాయ సంస్థ వెస్టా లీగల్‌లో గత ఏడాది డిసెంబర్ నుంచి లిపి ఇంటర్న్‌గా పనిచేయడం ప్రారంభించింది. అంతకు ముందు ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని రాయ్కర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు.