దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ పోస్ట్‌లో పని చేస్తున్న ఐఎఎస్ దంపతుల 27 ఏళ్ల కుమార్తె బహుళ అంతస్తుల భవనంలోని 10వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
తల్లిదండ్రులిద్దరూ సీనియర్ ఐఏఎస్‌లు. అంతమాత్రమే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిద్దరికి ఉండే ప్రొటోకాల్.. వారి హోదా.. వారి సంపద.. ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.