వెస్టిండీస్‌తో జరిగిన సెకండ్ వన్డేలో భారత జట్టు ఓటమి అభిమానులకు కోపం తెప్పించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో రోహిత్ శర్మ సేన పరువు పోగొట్టుకుంది. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కు ముందు అనవసర ప్రయోగాలకు పోయి టీమిండియా చేతులు కాల్చుకుంటుంది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇవ్వడం ఏంటని తప్పుబడుతున్నారు. పనిలో పనిగా టీమ్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా అభిమానులు ఏకిపారేస్తున్నారు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు ఏది కలిసి వస్తలేదని.. ఇప్పటి వరకు ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని నెట్టింట విమర్శల పర్వం కురుస్తుంది.
Read Also: Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి
రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైంది. ఆ తర్వాత అదే జట్టుకు వన్డే సిరీస్‌ను కూడా ఇచ్చేసింది. ఇక ఆసియా కప్‌ను నెగ్గడంలో పూర్తిగా భారత జట్టు విఫలమై.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లో చేతులెత్తేసింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను నెగ్గినా తర్వాత.. వన్డే సిరీస్.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆసీస్ చేతిలో దారుణంగా ఓడిపోయింది.
Read Also: Bobby : బాలయ్యతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయబోతున్న యంగ్ డైరెక్టర్..?
ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్ ఎక్కువగా ఉందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తుంటే రాహుల్ ద్రవిడ్ వల్ల టీమిండియాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు అని అంటున్నారు. ఇక, రాహుల్ ద్రవిడ్ నిర్ణయాలపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ద్రవిడ్ పిచ్చి ప్రయోగాలతో టీమిండియా తీవ్రంగా నష్టపోతుందని మండిపడుతున్నారు. #SackDravid.. అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.