ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలో నారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరితీయాలి. తిరుపతి వైసిపి పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లను నమోదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడిన పిడిఎఫ్ అభ్యర్థుల విజయం ఖాయం. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది. వాలంటీర్ ఇంటిలో 22ఓట్లు నమోదు చేయించారు.ఒక మహిళకు 21మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారు. యశోద నగర్ లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అక్రమాలకు అంతులేకుండా పోతోంది. తిరుపతి నగరంలో 7వేల దొంగ ఓట్లున్నాయన్నారు నారాయణ. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Read Also: Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్
ఈసీ చర్యలు తీసుకోవాలి.. కూన రవి
శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికను కూడా అవినీతిమయం చేయాలని చూస్తున్నారు. పది , ఐదు తరగతిచదవని వారు కూడా ఓటర్లుగా నమెదు అయ్యారు.తప్పుడు ధృవపత్రాలతో ఓటర్లుగా నమెదైన వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అర్హతలేని వారు గ్రాడ్యుయేట్స్ గా నమెదు అయ్యారు. తక్షణం వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.వాలంటీర్ ల ద్వారా ఓట్లు కోనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు.బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమచేసి , ఓట్లు కోనుగోలు చేయాలని చూస్తున్నారు. జిల్లా మంత్రులు ధర్మాన , సీదిరి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగలు , గ్రాడ్యుయేట్లు ఆలోచించి , టిడిపి బలపర్చిన పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది కి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలి.
Read Also: Business Headlines 08-03-23: ఇక.. ‘లోకేష్’ తుపాకీలు. మరిన్ని వార్తలు