ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులతో రేపు కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆయా జిల్లాలో ఉన్న కూటమి నేతలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ వచ్చేసింది.. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు..