Narayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చుతున్నారు.. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు? అంటూ నిలదీశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పారిశ్రామికవేత్త అదానీకి నొప్పి తగలకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో సీఎం జగన్ ఉన్నారంటూ మండిపడ్డారు.. జగన్మోహన్ రెడ్డి రోబో లాంటి వ్యక్తి.. ఆయనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేని వ్యక్తి అని విమర్శించారు.. రాజన్న రాజ్యం అని అధికారంలోకి వచ్చాక.. దోపిడీ రాజ్యంలా పాలన సాగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
Read Also:Metro : ఎండ దెబ్బకు.. నిండిన మెట్రో
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసే జరుగుతున్నాయని ఆరోపించారు సీపీఐ నారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సజ్జల వ్యాఖ్యలు దురదృష్టకరమన్న ఆయన.. బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడు.. దోపిడిదారులకు సజ్జల అధికారప్రతినిధి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కన్సర్న్ కూడా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ ఫైర్ అయ్యారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.