ఒక వైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెడదామంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇక అందరికీ కార్లు ఉండవు కదా.. అందుకే బస్సులు, ఆటోల కన్నా.. మెట్రో వైపు పరుగులు పెడుతున్నారు. ఐటీ కొలువులు చేసేవారికి మెట్రోలో ప్లేస్ దొరకడం లేదు. అంతేగాక ఇప్పుడూ సమ్మర్ హీటెక్కడంతో అంతా మెట్రో ప్రయాణం వైపే మొగ్గుచూపుతున్నారు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటున్నారు. అందరూ మెట్రోలో ప్రయాణం చేసేందుకు వస్తుండటంతో స్టేషన్లు మొత్తం పబ్లిక్ తో కిక్కిరిసిపోతున్నాయి. వారం రోజుల నుంచి ఇక్కడ రోజుకు 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నాట్లు తెలుస్తోంది.
Here a the answer.
When you will increase the coaches? #hyderabadmetro @KTRBRS @TelanganaCMO @NVSReddyIRAS pic.twitter.com/4GkAYW4iE4— Vishnu Vardhan (@vishnuremidi) April 20, 2023
Also Read : Sudan Crisis: సూడాన్ సంక్షోభం.. రంజాన్ సందర్భంగా మూడు రోజులు కాల్పుల విరమణ
అయితే మెట్రోలో కెపాసిటీకి మించి ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఇదీ ప్రమాదకరం కావడంతో మెట్రో సర్వీసులు పెంచాలని ప్యాసింజర్స్ డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ డే, ప్రత్యేక సందర్భం ఉంటేనే మెట్రో సర్వీసులు వేస్తారు.. ఈ మధ్య ఐపీఎల్ కోసం వేశారు.. ఎండలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీస్ పెంచితే బాగుంటుందని జనాలు అంటున్నారు. అయితే బస్సులు, ఎంఎంటీఎస్ లతో పోలిస్తే మెట్రో ఛార్జీ కాస్త ఎక్కువే.. అయినప్పటికీ చల్లదనం కోసం జనం మెట్రోలో ట్రావెల్ చేసేందుకు వస్తున్నారు.
Also Read : Somu Veerraju: బీజేపీతో టీడీపీ కలుస్తుందా? అచ్చెన్నాయుడు ఏం చెబుతారు..?
జనం మెట్రోకు అలవాటు పడ్డారు. ఇది వరకు ఉచితంగా అందించిన సేవలను ఇప్పుడు ఖరీదు చేస్తున్నారు. మెట్రో స్థలాల్లో ఇప్పటి వరకు ఫ్రీ పార్కింగ్ ఉండేది.. దాన్ని విత్ డ్రా చేసుకుంది. మెట్రో సర్వీస్ ప్రారంభించిన సమయంలో చార్జీలు వసూల్ చేయడంతో జనం ఆసక్తి చూపించలేదు.. ఇప్పుడు మెజార్టీ పీపుల్స్ వస్తుండటంతో మళ్లీ పార్కింగ్ కు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక పార్కింగ్ కే కాదు డిస్కౌంట్లను కూడా తగ్గించింది. టికెట్లపై ఇచ్చే రాయితీ, కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులు, డిజిటల్ క్యూఆర్ టికెట్లపై గల 10 శాతం డిస్కౌంట్లను తీసేసింది. మెట్రో రైలు.. పరిసరాల్లో మాల్స్ లో ఫ్రీ పార్కింగ్ కూడా ఇప్పుడు లేదు. అయినప్పటికీ చల్లని ఏసీ గాలి కోసం మెట్రోలో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Also Read : Mammootty : సూపర్‌స్టార్ మమ్ముట్టికి మాతృ వియోగం
రానున్న రోజుల్లో మరింతగా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రోజుకు సుమారు 4 లక్షల మంది ట్రావెల్ చేస్తుండగా.. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రోలో ప్రయాణించే వారు దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని దానికి అనుగుణంగా మెట్రో సర్వీసులను కూడా నడిపిస్తామని మెట్రో యాజమాన్యం పేర్కొంది. ఇప్పటికే మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు కూడా చేశారు. మెట్రోలో రద్దీని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.