CP Trivikram Varma: రియల్టర్ కిడ్నాప్ కేసు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కాదు.. కమీషన్ ఏజెంట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Trivikram Varma: విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. అయితే ఈ వ్యవహారంపై నగర సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. వీరు 2019లో విజయవాడలో ఎంకే కన్‌స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. పట్నాల శ్రీనివాస్ ఆయన భార్య లక్ష్మీని.. బ్రహ్మయ్య, సాయి నిఖిల్, మణికంఠ, ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తులు కారులో అపహరించారని.. మరోవైపు వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు కాదని కమీషన్ ఏజెంట్లని సీపీ తెలిపారు.
Read Also: NASA: చంద్రుడిపై మైనింగ్ చేయాలని నాసా ప్లాన్..
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
కిడ్నాప్‌కు గురైన శ్రీనివాస్ 2021లో రావుల పాలెంలో సత్య సౌధ సంస్ లో వాలంటీర్‌గా పని చేశాడని సీపీ తివిక్రమ్ వర్మ చెప్పారు. రెండు నెలలు క్రితం అక్కయ్యపాలెంలో ఇల్లు తీసుకుని చరణ్ గ్రూప్‌లో కమిషన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని కమీషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీనివాస్‌పై కంచికచర్ల, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడలలో చీటింగ్ కేసులున్నాయని సీపీ తెలిపారు. అయితే వీరి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీల వల్లే శ్రీనివాస్ ను, అతని భార్య లక్ష్మీని కిడ్నాప్ చేసినట్లు సీపీ తెలిపారు. యలమంచిలి దగ్గర శ్రీనివాస్ భార్య లక్ష్మీని విడిచిపెట్టారని.. ఆమె ఇచ్చిన సమాచారంతో కత్తిపూడి పోలీసులు నిందితులను పట్టుకున్నారని సీపీ పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: తెలంగాణ తరహాలో ఉండాలనేది నా కోరిక.. భీమవరంలో పవన్ కల్యాణ్..!
మరోవైపు విశాఖ నగరంలో ఉన్న గన్ లైసెన్సులపై సీపీ త్రివిక్రమ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో మొత్తం 620 గన్ లైసెన్స్ ఉన్నాయని చెప్పారు. 2020 నుంచి ఇప్పటి వరకు 15 మంది మాత్రమే గన్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారని తెలిపారు. 2020లోనే కలెక్టర్ ఆఫీస్ ద్వారా మంత్రి గుడివాడ అమర్నాథ్ దరఖాస్తు చేసుకున్నారని సీపీ పేర్కొన్నారు. ఇటీవలే కిడ్నాప్‌కు గురైన ఎంపీ కుటుంబ సభ్యులు కూడా గన్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు. ఇక గాజువాక విద్యార్థుల మిస్సింగ్ కేసుపైనా కమీషనర్ స్పందించారు. గాజువాకలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్ అయినట్లు కేసు నమోదు అయిందన్నారు. తొలుత వారు అనకాపల్లి వెళ్లినట్లు గుర్తించామని.. తర్వాత వెరీజ్ మై ట్రాయిన్ యాప్ ద్వారా సమాచారం తెలుసుకొని హైదరాబాద్ వెళ్లారని, వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గుర్తించామని త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!