Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఇక ఈరోజు కొత్త సంవత్సరం కావడంతో సామ్.. మరోసారి హీట్ పెంచేసింది. తాజాగా అమ్మడు ఒక పార్టీ వేర్ డ్రెస్ లో అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
సముద్రపు ఒడ్డున సామ్ న్యూయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. నైట్ వేర్ లో సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. చాలా మంది దేవదూతలు మన చుట్టూ ఉండవచ్చు.. నూతన సంవత్సర శుభాకంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇది చూసిన సామ్ అభిమానులు ఊరికే ఉంటారా.. ? మా దేవత నువ్వే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది సామ్.. కొత్త సంవత్సరం.. ఏంటీ ఈ అరాచకం..? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. సిటాడెల్ ఒకటి రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక ఏడాది ముగిసాకా సినిమాల గురించి ఆలోచిస్తాను అని చెప్పింది. మరి కొత్త ఏడాది కొత్త ప్లాన్స్ తో ఏమైనా వస్తుందేమో చూడాలి.