నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈబీసీ నేస్తం పథకం కింద.. 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి మంచి చేస్తున్న జగన్ ను కాదని నీతో సెల్ఫీలు దిగాలా అని ప్రశ్నించాలన్నారు. గతానికి, ఇప్పటికీ తేడా గురించి అడగాలని, చంద్రబాబు ముష్టి వేసినట్లు వెయ్యి పెన్షన్ ఇచ్చారన్నారు. చంద్రబాబుకు సీఎం పదవి అంటే దోచుకోవడం, తినుకోవటం అని ఆయన ధ్వజమెత్తారు. జగన్ కు సీఎం పదవి ఇవ్వటం అంటే ప్రతీ పేదవాడికి మంచి చేయడమేనని, ఎన్నికలయ్యాక మానిఫెస్టో వెబ్ సైట్లలో వెతికినా కనిపించవన్నారు.
Also Read : Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
రాబోయే ఇంకా చాలా డ్రామాలు చూస్తామని, వాళ్లకు తోడుగా వాళ్ల దత్త పుత్రుడు ఉన్నాడని, నేను ప్రజలనే నమ్మి ముందుకు వెళ్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. నాకు ప్రజలే సైనికులని, ప్రజలు మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలన్నారు. ‘వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తయింది.. సెప్టెంబర్, అక్టోబర్ లో పూర్తి చేస్తాం.. అక్టోబర్ లో వచ్చి ప్రాజెక్ట్ ప్రారంభిస్తా.. వైఎస్ఆర్ హయాంలో 20 కిలోమీటర్ల మేర సొరంగాలు పూర్తి చేశారు.. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే తీశారు.. ఎన్నెస్పీ కెనాల్ నుంచి పొదిలి చెరువుకు మంచి నీటి కోసం పైప్ లైన్ పనులు.. మార్కాపురం మెడికల్ కళాశాలకు భూములు ఇచ్చిన పేదలకు అదనంగా మరో మూడు లక్షలు ఇస్తాం’ అని ఆయన వెల్లడించారు.
Also Read : Korean actress: దక్షిణ కొరియా నటి జంగ్ చై-యుల్ అనుమానాస్పద మృతి