ZEE Telugu: సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు వచ్చేస్తున్న జీ తెలుగు..
- జీటీవీ లోకి వచ్చేస్తున్న కల్కి 2898 AD సినిమా.
- జనవరి 12న సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం
- సంక్రాంతి సందర్బంగా మరిన్ని కార్యక్రమాలతో వస్తున్న జీ తెలుగు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZEE Telugu: తెలుగు పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో మరింత ప్రత్యేకంగా మార్చే జీ తెలుగు ఈ సంక్రాంతికి మూడు ముచ్చటైన కార్యక్రామాలతో వినోదం పంచేందుకు సిద్దమైంది. నూతన సంవత్సరాన్ని ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన జీ తెలుగు తాజాగా కాకినాడలో విక్టరీ వెంకటేష్ అతిథిగా సంక్రాంతి సంబరాలను ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ ఈవెంట్‌తో వైభవంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ జనవరి 11, శనివారం సాయంత్రం 6 గంటలకు, పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడీ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జనవరి 12, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, సంక్రాంతి సంబరాలు ఫైర్ Vs వైల్డ్ ఫైర్ ప్రత్యేక కార్యక్రమం జనవరి 13, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది మీ జీ తెలుగు.
కాకినాడ వేదికగా జరిగిన ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ కార్యక్రమంలో జీ తెలుగు తారలతో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, గౌతమి, శ్రీలక్ష్మి, శివపార్వతి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ పాల్గొని అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. యాంకర్ రవి, అషు రెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో సందడిగా సాగింది.
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
ఈ సంక్రాంతి సంబరాల్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ సినిమాని అందిస్తోంది జీ తెలుగు. పురాణాలు, సైన్స్ ఫిక్షన్, అదిరిపోయే విజువల్స్ మేళవించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె వంటి నటుల అద్భుత నటన ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిపింది. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు జీ తెలుగు మరో అద్భుత అవకాశం కల్పిస్తోంది. Watch & Win కాంటెస్ట్ని నిర్వహిస్తోంది జీ తెలుగు. మీరు చేయాల్సిందల్లా కల్కి సినిమా చూస్తూ టీవీ స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం లేదా www.kalkionzeetelugu.zee5.com లో లాగిన్ అయి కల్కి గేమ్ ఆడి అదిరిపోయే బహుమతులు గెలవచ్చు. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన మొదటి అయిదుగురు కల్కి 2 సెట్స్ సందర్శన, 100 మంది కల్కి థీమ్‌తో అదిరిపోయే బహుమతులు అందుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ కాంటెస్ట్‌లో పాల్గొనండి.
జీ తెలుగు సంక్రాంతి సంబరాలకి కొనసాగింపుగా సంక్రాంతి సంబరాలు ఫైర్ Vs వైల్డ్ ఫైర్ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. యాంకర్ రవి, వర్షణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, జీ తెలుగు తారలు అత్తలు, కోడళ్లు పేరున రెండు టీమ్‌లుగా ఏర్పడి వినోదం పంచేందుకు పోటీపడ్డారు. బేబీ సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, వందేమాతరం శ్రీనివాస్,సీనియర్ హీరోయిన్ రాధ, మన్మథుడు సినిమా ఫేమ్ అన్షు, దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య హాజరై అందరిలో మరింత ఉత్సాహం నింపారు. వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమాలను జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూడండి. వినోదభరితంగా సాగిన జీ తెలుగు సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాన్ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడీ.. ఈ శని,ఆది, సోమవారాల్లో మీ జీ తెలుగులో.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!