CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలపై అధికారులు సీఎంకు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెప్మా, హెల్త్, సివిల్ సప్లై శాఖలను నైపుణ్య పోర్టల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 35 మంది భవన నిర్మాణ కార్మికులకు పీ4 పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను సీఎం చంద్రబాబు అందజేశారు. అలాగే మేడే పురస్కారాలను కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ఏపీలో ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం వచ్చింది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గత 22 నెలలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. మేడే అనేది శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే రోజని, కార్మికుల హక్కులను గుర్తుచేసే సందర్భమని పేర్కొన్నారు. పామర్రు అనేది మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మస్థలం అని, ఆయన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం శారీరక కష్టం కంటే నైపుణ్యంతో పని చేసే రోజులు వచ్చాయని, అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, అందుకు ఎమ్మెల్యేలు కూడా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. “నేను ఎమ్మెల్యేల వైపు కాదు, ప్రజల వైపే ఉంటాను” అని స్పష్టం చేశారు.
తాజాగా ముంబైలో తనకు వచ్చిన బిజినెస్ రిఫార్మర్ అవార్డు గురించి చంద్రబాబు మాట్లాడుతూ, అది తనకే కాదు రాష్ట్రానికి, అధికారులకు వచ్చిన గుర్తింపు అని పేర్కొన్నారు. “నేను టీమ్ లీడర్‌ను. టీమ్ బాగా పని చేస్తేనే నాకు పేరు వస్తుంది” అని అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణం, పారిశ్రామిక కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. మహిళల కోసం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తామని, 2028 నాటికి కృష్ణా పుష్కరాల సమయానికి కృష్ణా జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బందరు పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విశాఖ తర్వాత అభివృద్ధి, ఆదాయం పరంగా కృష్ణా జిల్లా రెండో స్థానంలో ఉందని చెప్పారు.
అమరావతి నిర్మాణంపై మాట్లాడిన ఆయన.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం వల్లే రాజధాని అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. రెండో దశలో కూడా రైతులు భూములు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, వారి ఋణం తీర్చుకుంటానని తెలిపారు. ఇక ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, గతంలో రాష్ట్ర అభివృద్ధికి భంగం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి, ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, కార్మిక సంక్షేమం, మరియు భవిష్యత్ ప్రణాళికలపై తన దృష్టిని స్పష్టంగా వివరించారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
-
Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
-
IPL CheerLeaders Salary: గ్లామర్‌తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!