Gannavaram Airport Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. లగేజీని…
Mandava Janakiramayya Passes Away: విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ మండవ జానకిరామయ్య కన్నుమూశారు.. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకిరామయ్య, గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు విజయ డెయిరీ చైర్మన్‌గా అంటే ఏకంగా 27 సంవత్సరాలు సేవలందించిన ఆయన, రాష్ట్రంలోని పాడి రైతుల సంక్షేమం కోసం నిరవధికంగా కృషి చేశారు. తన స్వగ్రామం మొవ్వలో విద్యా అభివృద్ధికి…
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామర్రు మండలం కాపవరం వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు దగ్డమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మొవ్వ మండలం కాజా గ్రామానికి చెందిన కామేశ్వర రెడ్డి…