AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 26 అంశాలపై చర్చించి, అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు రూ.443 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే, అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా వివిధ పనులకు రూ.2540 కోట్ల ప్రణాళికను ఆమోదించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్‌కు రూ.798 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికను కూడా ఆమోదించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపగా.. పోలవరం ప్రాజెక్ట్ బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
Read Also: Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
మరోవైపు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) నిబంధనల్లో సవరణలపై కేబినెట్లో చర్చ సాగుతోంది.. అలాగే అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రెవెన్యూ శాఖకు చెందిన భూముల కేటాయింపుల రద్దుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంపుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. డ్రెయిన్ సైఫన్ నిర్మాణ పనులకు రూ.76 కోట్లకు పైగా వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వనుంది.. హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌కు రూ.3099 కోట్ల సవరణ అంచనాలను కూడా ఆమోదించే అవకాశం ఉంది.. పలు పరిపాలనా నిర్ణయాలు కూడా కేబినెట్లో తీసుకున్నారు. హోంశాఖలో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతి ఇవ్వనున్నారు.. హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో 21 కొత్త పోస్టులను సృష్టించారు. పంచాయతీ రాజ్ శాఖలో 20 పోస్టులు సృష్టించడంతో పాటు 9 పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇతర కీలక నిర్ణయాల్లో భాగంగా, న్యూ ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయించేందుకు సిద్ధమైంది మంత్రివర్గం.. మార్క్‌ఫెడ్‌కు రూ.1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌కు ప్రభుత్వ హామీ ఇచ్చారు. రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పులకు కూడా ఆమోదం తెలపనుంది.. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం, మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనల్లో మార్పులు చేయడం, మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లును ప్రతిపాదించడం వంటి అంశాలను కూడా కేబినెట్ చర్చిస్తుంది.. అదనంగా, తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపు, కడపలో 92 ఎకరాల డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూముల బదిలీ వంటి ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తానికి, ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపుకు దోహదపడే కీలక నిర్ణయాలు తీసుకోబడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!