TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Laddu Report: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. తిరుమల లడ్డూ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం వంటి అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహారశైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది.
Read Also: Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అలాగే, సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపుకు గురయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?