Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beetroot Rice Recipe: బీట్రూట్ రైస్ అనేది కేవలం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే వన్-పాట్ రెసిపీ. బాస్మతి బియ్యం, బీట్రూట్ ముక్కలు, మసాలా దినుసుల మేళవింపుతో తయారయ్యే ఈ పులావ్ స్టైల్ వంటకం పిల్లలకు, ఆఫీసుకి వెళ్లే వారికి లంచ్ బాక్స్‌లో చాలా బాగుంటుంది. బీట్రూట్ తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాంటి టేస్టీ, హెల్తీ బీట్రూట్ రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1 కప్పు బాస్మతి బియ్యం (కడిగి 30 నిమిషాలు నానబెట్టినవి)
ముఖ్యమైన కూరగాయలు: 1 చిన్న బీట్రూట్ (ముక్కలు), 1 చిన్న ఆలుగడ్డ (ఐచ్ఛికం), 1/3 కప్పు పచ్చి బఠానీలు.
మసాలాలు: బిర్యానీ ఆకు, జీలకర్ర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు.
ఫ్లేవర్ కోసం: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పసుపు.
నూనె, ఉప్పు, నీళ్లు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
తయారీ విధానం
మొదటగా నానబెట్టుకున్న బియ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ప్రెజర్ కుక్కర్ లేదా గిన్నెలో నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులన్నీ (బిర్యానీ ఆకు, జీలకర్ర, చెక్క, మొగ్గ) వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు, ఆలుగడ్డ, బఠానీలు, కొత్తిమీర, పుదీనా వేసి 2-3 నిమిషాల పాటు సాటే చేయాలి. తగినన్ని నీళ్లు (కుక్కర్ అయితే 1¾ కప్పులు), ఉప్పు వేసి ఎసరు మరిగాక నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. ఎసరు కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకుంటే అన్నం ఉడికాక రుచి బాగుంటుంది. కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చే వరకు, మామూలు గిన్నెలో అయితే నీరు ఇంకిపోయే వరకు తక్కువ మంటపై ఉడికించాలి. చివరగా ప్రెజర్ పోయాక అన్నాన్ని నెమ్మదిగా కలుపుకుని, కొంచెం నిమ్మరసం చల్లుకుంటే రుచికరమైన బీట్రూట్ రైస్ సిద్ధం.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!