Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: అమరావతి పరిధిలోని తుళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి నిర్మాణం, రైతుల త్యాగం, మరియు ఆస్పత్రి ప్రాజెక్ట్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలకు బాలకృష్ణ పాదాభివందనం తెలిపారు. వారి సహకారం వల్లే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు స్వాతి నక్షత్రం కావడం ప్రత్యేకమని, అది తన తండ్రి మరియు తనకు దైవసమానమైన నరసింహ స్వామి పుట్టిన నక్షత్రం కావడంతో ఈ రోజున పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Read Also: Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
అమరావతిలో ఇప్పటికే ఆగస్టు 13న ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామని, అయితే నిర్మాణం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు రావడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు బాలయ్య… ఇప్పుడు అన్ని అనుమతులు పూర్తయ్యాయని, పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తొలి దశలో 7 అంతస్తులతో 500 పడకల సదుపాయం కలిగిన ఆధునిక ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దాదాపు రూ. 650 కోట్ల వ్యయంతో ఈ దశను అమలు చేయనుండగా, 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంపై కూడా బాలకృష్ణ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదని, గొప్ప ప్రణాళికతో ముందుకు సాగుతోందని అన్నారు. ఏదో హడావుడిగా నిర్మించి మళ్లీ కూల్చేసే విధంగా కాకుండా, పద్ధతిగా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు నందమూరి బాలకృష్ణ..
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!