ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాజధానిలో సాంకేతిక విప్లవానికి…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే దిశగా, రాజధానిలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ…
AP Cabinet : అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల సృష్టికి సంబంధించి పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని నీటిపథకాల అభివృద్ధి కోసం భారీగా రూ.9,514 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. త్రాగునీరు, సాగునీరు విభాగాల్లో ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమల విస్తరణలో భాగంగా, ప్రముఖ విరూపాక్ష ఆర్గానిక్స్ సంస్థకు 100…
Pemmasani Chandrasekhar: అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కానీ, వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా.. లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతుంది.
అమరావతి నగరాన్ని నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతిని మరలా పునఃప్రారంభించటం మంచి శుభదాయకం అని, ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారన్నారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిదని, దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా చూసుకుంటాం అని కేంద్ర మంత్రి…
ఇటీవలే ప్రధాని మోడీ వచ్చి అమరావతి పనులు పునఃప్రారంభించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2028 మార్చ్ నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు. అమరావతి రైతుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రాజధానికి కేంద్ర సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం రూ.15 వేల కోట్లు రాజధానికి ఇచ్చిందన్నారు. అమరావతిని వినూత్న నగరంగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతిలో బ్యాంకుల…
అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇదొక బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతి కోసం ప్రతి అడుగు అభివృద్ధికి ప్రధాని మోడీ అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కాగితాల్లో కరిగిపోకుండా.. జవాబుదారితనం, మంచి సారథ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో…
Amaravati Development: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు శుభవార్త చెప్పింది.. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.1,863 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే…
Amaravati Land Allotment: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రతిష్టాత్మక సంస్థలను రాజధానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే పలు సంస్థలకు భూములు కేటాయించగా.. తాజాగా, మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలకు భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల బృందం చేసిన సిఫార్సుల ఆధారంగా భూముల కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 49.50 ఎకరాల భూమిని 11 సంస్థలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…