Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
- వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి
- వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనాపూర్ మండలం మీదికొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలోనే అనేక అంశాలపై పార్టీ అధిష్ఠానానికి సూచనలు చేశానని, పలు విషయాల్లో విభేదించానని తెలిపారు. వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి, జిల్లాను ముక్కలుగా విభజించవద్దని అప్పట్లో సూచించానన్నారు. అయితే తన మాటను పట్టించుకోకుండా వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే మేలు చేసిందని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ సాధనతో ఆ కుటుంబానికి అధికారం దక్కిందని, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి, దాచుకోవడానికి తెలంగాణను వేదికగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆగం చేసింది కేసీఆర్ అని స్వయంగా ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే చెబుతున్నారని అన్నారు. కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉందని పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
- Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
- Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
- Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అయితే గతంలో కేసీఆర్ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని, వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. “మీరు చేస్తే రాజకీయాలు, ఇతరులు చేస్తే వ్యభిచారమా?” అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, అహంకారం నచ్చకే తాను ఆయనకు, బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నానని తెలిపారు. తాను దూరమవడం ఒకటైతే, సొంత కుమార్తె కవిత ఎందుకు దూరమైందో కూడా చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని కడియం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
-
Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!