నందిగామ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2004 లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.. హైదరాబాద్ అభివృద్ధి చేశామని.. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో మళ్ళీ గెలిచాము.. చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ముఖ్యం.. కార్యకర్తలు యక్టీవ్ గా లేకపోతే పార్టీకి కష్టం.. మొదటి రోజు నుంచే కార్యకర్తల కోసం కష్టపడుతున్నా.. పార్టీని సమర్ధవంతంగా స్ట్రీమ్ లైన్ చెయ్యడం కోసం ఎంతో కష్టపడుతున్నాం.. ఏ పార్టీ కార్యాలయంలో లేని గౌరవం టీడీపీలో దొరుకుతుంది..
Also Read:Fake Doctor: దారుణం.. హార్ట్ సర్జరీలు చేసిన “ఫేక్ డాక్టర్”.. ఏడుగురి మృతి..
నాయకుల కంటే కార్యకర్తలపైనే ఎక్కువ నమ్మకం.. నాయకులు కుప్పిగంతులు వేసిన కార్యకర్తలు స్ట్రాంగ్ గా ఉన్నారు.. నా జీవితంలో 2019- 24 పరాకాష్ట.. నా పైనే రాళ్ళు వేసిన పరిస్థితి.. వ్యవస్థను బాగు చెయ్యకపోతె మనది కూడా మున్నాళ్ల ముచ్చటే అవుతుంది.. టీడీపీలో ప్రతి నాయకులు.. కార్యకర్త నాతో సహా కొంతమంది ఓటర్లను ఓన్ చేసుకోవాలి.. నేను నా నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని 60 మంది ఓటర్లతో టచ్ లో ఉంటాను.. అంటే 15 కుటుంబాలతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యాలి..
Also Read:Akhil-6 : అఖిల్-6 ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే.. నాగవంశీ అప్ డేట్..
1994 లో ప్రతిపక్షానికి 26 సీట్లు మాత్రమే వచ్చాయి.. ఇప్పుడు 11 వచ్చాయి.. 2029 లో మళ్ళీ మనం గెలిస్తే కానీ అభివృద్ధి జరగదు.. 2029లో గెలవడానికి ఏమి చెయ్యాలో ఇప్పటినుంచే ప్రణాళికలు తయారు చెయ్యాలి.. కార్యకర్తలు చేసే పనులు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి.. పనులు కార్యకర్తల ద్వారానే జరగాలి.. కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు.. సంక్షేమం అందరికి ఉంటుంది.. సమస్య వస్తే చాలా కఠినంగా ఉంటా.. మనల్ని ఎవ్వరూ ఓడించరు.. మనమే ఓడించుకుంటాం.. కార్యకర్తలు అలిగి ఇంట్లో కూర్చుంటే పార్టీ దెబ్బ తింటుంది.
Also Read:Vikarabad: రూ. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసిన మరో మహిళ..
కుప్పం.. హిందూపూర్ లో పది సార్లు గెలిచి నందిగామ లో రెండు సార్లు ఓడిపోయాం.. నందిగామ నేతల్లో సరైన ఐక్యత లేదు.. నియోజకవర్గం బెస్ట్.. కానీ ఐక్యత లేదు.. ఐదేళ్లలో 175 నియోజకవర్గాల్లో మీటింగ్ లు పెడతా.. 43 ఏళ్ళు జెండా మోసిన మీతో రెండు గంటలు మాట్లాడతా.. ఆ తృప్తి వేరు.. నందిగామ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎమ్మెల్యేతో తయారు అవుతుంది.. నందిగామలో మెంబెర్ షిప్ లో 134 స్థానంలో ఉన్నారు.. నాయకులు మాత్రం బలంగా ఉన్నారు.. కానీ మెంబర్ షిప్ లేదు.. నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో చాలా తక్కువ రోజులు ఉన్నారు..
Also Read:Fire Break : కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
గెలవని అభ్యర్థికి సీట్ లేదు.. ఇమేజ్ పర్సనల్ లైఫ్ తో పాటు నియోజకవర్గంలో తిరగాలి.. నందిగామ ఎమ్మెల్యే మంచితనం ఆమెకు చెడు చేస్తోంది.. కడపలో టీడీపీ సత్తా మహానాడులో చూపుతున్నాం కడప కూడా మనదే.. ఎంపీ మరో ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిచే వాళ్ళం.. కానీ తప్పుడు అంచనాలతో సీట్లు కోల్పోయాము.. అందరి రిపోర్ట్ లు తెప్పించుకుంటున్నా.. నెగిటివ్ ఉంటే దండం పెడతా.. పాజిటివ్ వస్తే దండ వేస్తా అని చంద్రబాబు వెల్లడించారు.