Fire Break : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కార్లు. రెండు ఆటోలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన కార్లు ఆటో లు పోలీస్ స్టేషన్ వెనకాల ఖాళీ స్థలంలో ఉంచారు. ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ అవతలి భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు మంటను ఏర్పాటు చేశారు ఆ మంటలు చెలరేగి కార్లపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే మంటలు వ్యాపి చెందడం తో ఏమి చేయలేక ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అక్కడికిచేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ రెండు కార్లు, రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమయ్యాయి మంటలు వ్యాపిస్తున్న సమయంలో పక్కనే పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ కూడా ఉండటం తో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమయానికి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
DC vs CSK : చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కు రంగం సిద్ధం… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.