Akhil-6 : అక్కినేని అఖిల్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన నుంచి ఓ బిగ్ అప్ డేట్ కూడా రావట్లేదు అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం సైలెంట్ గానే సినిమా షూటింగులు చేసేస్తున్నాడు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా బయటకు తెలియనివ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 8న భారీ అప్ డేట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్-6 మూవీ నుంచి నిర్మాత నాగవంశీ బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో అఖిల్ తన ఆరో సినిమాలో నటిస్తున్నాడు. చిత్తూరు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతోంది.
Read Also : Bandi Sanjay : మోడీ బియ్యంపై గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం
శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ఏప్రిల్ 8వ తేదీని ఇస్తామని తాజాగా నాగవంశీ ట్వీట్ చేశారు. ఆ రోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెనిన్ అనే టైటిల్ ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది. ఈ సినిమాను నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే తాను అడ్వాన్స్ ఇచ్చినట్టు ఇంతకుముందే నాగవంశీ తెలిపాడు. అఖిల్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. గడ్డం, పొడవాటి జుట్టుతో ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.