నందిగామ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2004 లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.. హైదరాబాద్ అభివృద్ధి చేశామని.. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో మళ్ళీ గెలిచాము.. చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ముఖ్యం.. కార్యకర్తలు యక్టీవ్ గా లేకపోతే పార్టీకి కష్టం.. మొదటి రోజు నుంచే కార్యకర్తల కోసం కష్టపడుతున్నా.. పార్టీని సమర్ధవంతంగా స్ట్రీమ్ లైన్ చెయ్యడం కోసం ఎంతో కష్టపడుతున్నాం.. ఏ పార్టీ కార్యాలయంలో…
ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ప్రసిద్ధ బంబేశ్వర్ పర్వతం సమీపంలో నిర్మించిన ఆలయం, మసీదు అంశం ఊపందుకుంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ముదినేపల్లి మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు.. KDCC బ్యాంక్ చైర్మన్ తాతిలేని పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.... జగనన్న రెండు రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోను మన కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. అక్కా చెల్లెలు గ్రామాల్లో తిరిగి మన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని…
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే…
నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లాకు సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా…
కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న పత్తికొండలో రా..కదిలి రా కార్యక్రమం జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.
బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు గల కారణాలు తెలియకపోవడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్డండ పీఎస్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ కార్యకర్తలు పీఎస్ ముందు బైఠాయించి…
హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్.. తుంటి నొప్పితో ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. తాజాగా కేసీఆర్ ను చూడటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ముందు జై కేసీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు.