World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనాభా భారం కాదు.. జనమే ఆస్తిగా పేర్కొన్న ఆయన.. ఎక్కవ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో అద్దె ఇస్తున్నారు, ప్రత్యక్ష నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపారు.. ఫ్రాన్స్ లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.. హంగేరిలో పెద్ద కుటుంబాలకు కారులు ఇస్తున్నారు.. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రభుత్వం 12 లక్షలు ఆర్ధిక సాయం చేస్తోంది.. 67.41 శాతం ఇద్దరు ఉండాలని చెప్పారు. జనాభా వద్దనుకునే వారు పెరుగుతున్నారు.. ఈ సమస్యను మనం అధిగమించాలని పిలుపునిచ్చారు..
Read Also: Raja Saab : తమన్ సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదా.. అందుకే దగ్గరుండి మరి.?
అసలు, 20 శాతం మంది పెళ్లి వద్దనుకుంటున్నారనే సర్వేలో వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. సరైన ఆదాయం, ఉద్యోగం లేకపోవడం వల్లే చాలామంది పిల్లలు వద్దనుకుంటున్నారన్న ఆయన.. ఈ పరిస్థితులను అధిగమించి.. జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.. ఇక, సీఎం చంద్రబాబు ఉపన్యాసం తర్వాత అభిప్రాయాలు ప్రత్యక్షంగా తీసుకున్నారు.. ఉమ్మడి కుటుంబం ఆవశ్యకత ఇప్పడు ఎంతయినా ఉంది అని పేర్కొన్నారు ఓ ఉపాధ్యాయుడు.. ఉమ్మడి కుటుంబం కాకపోవడం వల్లే ఒక మహిళా ఉద్యోగి ఉద్యోగం వదులుకుంది అని వెల్లడించారు.. అందుకే ఉమ్మడి కుటుంబం ఉంటే మహిళ ఉద్యోగం చేయడం సులభం అని సీఎం తెలిపారు.. భగవంతుడు ఆడవాళ్లకే ఇచ్చిన వరం పిల్లల్ని కనడం.. ఈ విషయంలో మగవాళ్లలో మార్పురావాలి.. మనం కోటేషన్ లలో మాట్లాడుతున్నాం .. ఆడంగి వారు, గాజులు తొడుక్కో అని అంటున్నాం ఇది తప్పు అని సూచించారు.. కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని నేను చెపుతున్నా.. మన పాలసీలు ప్రపంచానికి మార్గదర్శకత్వం.. రానున్న 5 ఏళ్లలో ఆ ప్రభావం చూపుతాయన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Raja Saab : తమన్ సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదా.. అందుకే దగ్గరుండి మరి.?
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని నేనే చట్టం తీసుకొచ్చా.. కానీ, ఒక్కోసారి పాలసీలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు జనాభా భారం కాదు.. జనమే ఆస్తి అన్నారు చంద్రబాబు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు ఉంటాయి.. జనాభా పెరిగితే పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, అవకాశాలు ఉంటాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, నేనెప్పుడూ మహిళా పక్షపాతిని.. ఆస్తిలో మహిళలకి సమానహక్కు కలిపించి ఎన్టీఆర్ మహిళల పక్షాన నిలబడ్డారు.. జనాభా నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. త్వరలో జనాభా నిర్వహణపై డ్రాఫ్ట్ పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.. అయితే, మితి మీరిన నియంత్రణ చర్యలు వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం అని చెప్పి 15 వేలు ఇస్తున్నాం అన్నారు.. జనాభా పెరుగుదల కోసం అందరు కృషి చేయాలి.. చైనా జనాభా నియంత్రణ వలన చాలా నష్ట పోయింది.. జనాభా పెరుగుదల కోసం అందరం మాట్లాడాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..