ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనాభా భారం కాదు.. జనమే ఆస్తిగా పేర్కొన్న ఆయన.. ఎక్కవ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో అద్దె ఇస్తున్నారు, ప్రత్యక్ష నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపారు.. ఫ్రాన్స్ లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.. హంగేరిలో పెద్ద కుటుంబాలకు కారులు ఇస్తున్నారు.. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రభుత్వం 12…
జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దినోత్సవం ఫోకస్ తో జరుగుతోంది.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ…
నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు..
నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానంలో భారత్ అవతరించనుందని నివేదికలో పేర్కొంది.
కొన్ని సంవత్సరాల నుంచి భారత్ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నాటికి చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస సోమవారం 2022 ప్రపంచ జనాభా అంచనాల నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌కల్లా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని, ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న…