ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనాభా భారం కాదు.. జనమే ఆస్తిగా పేర్కొన్న ఆయన.. ఎక్కవ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో అద్దె ఇస్తున్నారు, ప్రత్యక్ష నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపారు.. ఫ్రాన్స్ లో చైల్డ్ అలవెన్స్ కింద ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.. హంగేరిలో పెద్ద కుటుంబాలకు కారులు ఇస్తున్నారు.. చైనాలో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రభుత్వం 12…
జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దినోత్సవం ఫోకస్ తో జరుగుతోంది.. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ…